రామప్ప దేవాలయము
రామప్ప దేవాలయము చారిత్రక ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం ప్రదేశము దేశము : భారత దేశం రాష్ట్రం : తెలంగాణ జిల్లా : వరంగల్లు ప్రదేశము : పాలంపేట ఆలయం యొక్క వివరాలు ప్రధాన దైవం : శివుడు ఉత్సవ దైవం : రామలింగేశ్వరుడు నిర్మాణ శైలి మరియు సంస్కృతి వాస్తు శిల్ప శైలి : కాకతీయుల కాలం నాటిది ఇతిహాసం నిర్మాణ తేదీ : క్రీ.శ. 1213 ) రామప్ప దేవాలయ చరిత్ర ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇ...